Bhamidipaati GowriSankar
’కవిత్వం శ్రావ్య కళ’ అనేది క్షేమేంద్రుని వ్యాఖ్యానం. కవిత్వం.. దీని భాష, పదాల అమరిక, లయ వంటివి ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ’లయాత్మకమైన కవిత్వం శాశ్వతమే’ అనేది కాళిదాసు, పోతన, కవిత్రయం వంటి వారి నుంచి నేటి రాయప్రోలు, గురజాడ, శ్రీ.శ్రీ వరకు నడుస్తున్న చరిత్ర. ప్రక్రియలు వేరు కావచ్చు. సంప్రదాయ ఆధునికతలనే పేర్లు మారవచ్చు కానీ.. నిజమైన కవిత్వం అజరామరం. ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసాల నుంచి అంతరిక్షం, అంతర్జాతీయ యుద్ధాలు, ఆవకాయల వరకు కవిత్వానికి వస్తువులే. భావకవిత్వంను ప్రేమ కవిత్వం అనే వారున్నారు. దేవులపల్లి, రాయప్రోలును అక్కున చేర్చుకున్నారు. కవిత్వం మనసును రంజింపజేసే శాశ్వతమైన ఔషధం.-- భమిడిపాటి గౌరీశంకర్